జనసేన పార్టీ తరపున తొలిజాబితాలో నలుగురు లోక్ సభ, 32 మంది శాసన సభ్యుల పేర్లను ప్రకటించింది. బుధవారం అర్థరాత్రి అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.
అమరావతి: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై జనసేన పార్టీ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించిన ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ ఎట్టకేలకు తొలి జాబితాను విడుదల చేసింది.
జనసేన పార్టీ తరపున తొలిజాబితాలో నలుగురు లోక్ సభ, 32 మంది శాసన సభ్యుల పేర్లను ప్రకటించింది. బుధవారం అర్థరాత్రి అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.
జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ తొలిజాబితాకు ఆమోద ముద్రవేశారు. అనంతరం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
జనసేన పార్టీ పార్లమెంటు అభ్యర్థులు
1. అమలాపురం: డి.ఎం.ఆర్ శేఖర్
2. రాజమండ్రి : ఆకుల సత్యనారాయణ
3. విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు
4. అనకాపల్లి: చింతల పార్ధసారధి
జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్ధులు:
1. యలమంచిలి : సుందరపు విజయ్‌కుమార్,
2. పాయకరావుపేట: నక్కా రాజబాబు
3. పాడేరు : పసుపులేటి బాలరాజు
4. రాజాం : ముచ్చా శ్రీనివాసరావు
5.శ్రీకాకుళం : కోరాడ సర్వేశ్వరరావు
6. పలాస : కోత పూర్ణచంద్రరావు
7. ఎచ్చెర్ల : బాడన వెంకట జనార్ధన్(జనా)
8. నెల్లిమర్ల : లోకం నాగమాధవి
9. తుని : రాజా అశోక్‌బాబు
10. రాజమండ్రి సిటీ : కందుల దుర్గేష్
11. రాజోలు : రాపాక వరప్రసాద్
12. పి.గన్నవరం : పాముల రాజేశ్వరి
13. కాకినాడ సిటీ: ముత్తా శశిధర్
14. అనపర్తి : రేలంగి నాగేశ్వరరావు
15. ముమ్మిడివరం : పితాని బాలకృష్ణ
16. మండపేట : వేగుళ్ల లీలాకృష్ణ
17. తాడేపల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్
18. ఉంగుటూరు : నవుడు వెంకటరమణ
19. ఏలూరు : రెడ్డి అప్పలనాయుడు
20. తెనాలి : నాదెండ్ల మనోహర్
21. గుంటూరు వెస్ట్ : తోట చంద్రశేఖర్
22. పత్తిపాడు : రావెల కిషోర్‌బాబు
23. వేమూరు : ఎ.భరత్ భూషణ్
24. నరసరావుపేట : సయ్యద్ జిలానీ
25. కావలి : పసుపులేటి సుధాకర్
26. నెల్లూరు రూరల్ : చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
27. ఆదోని : మల్లిఖార్జునరావు(మల్లప్ప)
28. ధర్మవరం : మధుసూదన్‌రెడ్డి
29.రాజంపేట : పత్తిపాటి కుసుమకుమారి
30. రైల్వే కోడూరు : బోనాసి వెంకటసుబ్బయ్య
31. పుంగనూరు : బోడే రామచంద్ర యాదవ్
32. మచిలీపట్నం: బండి రామకృష్ణ
పవన్ కళ్యాణ్ తొలిజాబితాలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలలకు ప్రాధాన్యత కల్పించారు. జనసేన పార్టీకి బలమున్న 19 నియోజకవర్గాలను ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాల నుంచే ఎంపిక చేశారు. ఇక పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే నలుగురు అభ్యర్థులు విశాఖపట్నం జిల్లా ఎంపీలను ప్రకటించిన పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలకు గానూ రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు
