రాజమండ్రిలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు పవన్ కల్యాణ్

* రైతుకు ఎకరానికి రూ.8 వేలు సాగు సాయం, మిగులు బడ్జెట్ ఉంటే రూ.పది వేలకు పెంపు

* రైతు రక్షక భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్న, చిన్నకారు, కౌలు రైతులకు నెలకు రూ. 5 వేలు పెన్షన్

* భూములు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం

* రైతులకు పారిశ్రామికీకరణలో భాగస్వామ్యం

* ఉభయ గోదావరి జిల్లాల కోసం రూ.5 వేల కోట్ల పెట్టుబడితో గ్లోబల్ మార్కెట్. 

* ప్రతి మండలాల్లో గిడ్డంగులు

* రైతుకు ఉచితంగా సోలార్ మోటార్ పంపు సెట్లు

* ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్‌ త్వరతగతిన పూర్తి

* ఉత్తరాంధ్రలో నదుల అనుసంధానం

* రిజర్వాయర్ల మరమ్మత్తులు, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం

* ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య

* కాలేజీలకు వెళ్లడానికి ఉచిత రవాణా సదుపాయం

* విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ క్యాంటీన్లు

* ప్రతి అసెంబ్లీ, మండల కేంద్రాల్లో డిగ్రీ, అగ్రికల్చరల్, పాలిటెక్నిక్ కాలేజీలు

* రాష్ట్ర ఉద్యోగ పరీక్షల ఫీజు సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తే చాలు

* అన్ని కులాలకు కామన్ స్కూల్, కామన్ హాస్టల్స్

* వృత్తి కళాశాలల్లో ఇనవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్లు 

* ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు 

* కుల, మత, పేద, ధనిక తేడా లేకుండా కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా

* దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్లను 30 పడకల ఆసుపత్రులుగా మార్పు

* ప్రతి మండలంలో మొబైల్ డయాగ్నోస్ సెంటర్ల ఏర్పాటు

* తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల పావలా వడ్డీతో రూ. 5 వేలు రుణ సాయం

* ప్రభుత్వ ఉద్యోగుల కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ రద్దు

* బీసీలకు రాజకీయాలలో 5 శాతం రిజర్వేషన్లు

* కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు

* ముస్లింల సంక్షేమం కోసం సజ్జార్ కమిటీ సిఫారసుల అమలు

* మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా బ్యాంక్

* వేట లేని సమయంలో మత్స్సకారులకు 300 రోజుల ఉపాధి కల్పన

* తుఫాన్లు సమయంలో రోజుకు రూ.500 సాయం

* మత్స్యకార గ్రామాలకు తాగునీటి సదుపాయం

* మత్స్యకారుల కోసం జెట్టీలు, హార్బర్‌ల నిర్మాణం

* మత్స్యకార యువతకు ఉద్యోగాలు

* మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు

* మహిళలకు అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్లు

* పంచాయతీ రాజ్ సంస్థల్లో డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత

* మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్

* పండుగలకు మహిళలకు చీరలు, బహుమతులు

* మహిళల కోసం బ్యాంక్

* మహిళల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

* మండలానికో కల్యాణ మండపం

* మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ ఏర్పాటు

* పారిశుద్ధ్య పనుల్లో ఉన్న రెల్లి కుటుంబాలకు స్వయం ఉపాధి కోసం రూ.50 వేలు వడ్డీ లేని రుణం

* రెల్లి కార్మికులకు ఆటో రిక్షాల కొనుగోలు 50 శాతం సబ్సిడీ

* ప్రైవేట్ సంస్థల్లో ఉన్న రెల్లి ఆడపడుచుల కోసం ఉచిత స్కూటర్లు

* యువత కోసం జిల్లాకో మూడు ఆపర్చ్యూనిటి జోన్ల ఏర్పాటు

* జిల్లాకు 10 చొప్పున 130 స్మార్ట్ సిటీల అభివృద్ధి