జనసేన పార్టీ పై ఆ పార్టీ మహిళా నేత ఒకరు సంచలన ఆరోపణలు  చేశారు. పార్టీ కోసం పనిచేసేవారికి టికెట్లు ఇవ్వకుండా.. కేవలం డబ్బున్నవారికీ అవినీతి పరులకు టికెట్లు ఇస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు దువ్వెల సృజన ఆరోపించారు.

ఆమె తాజాగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్థి  చిర్రి బాలరాజు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో రూ.2కోట్లు అవినీతికి పాల్పడ్డారని.. అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆమె ఆరోపించారు.

జనసేన పార్టీ అభివృద్ధికి తాను శాయక్తులా కృషి చేస్తే.. తనకు కాదని.. అవినీతి పరుడికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఇదే విషయంపై తాను పార్టీ అధిష్టాన్ని ప్రశ్నిస్తే.. రూ.50లక్షలు ఉంటే టికెట్ ఇస్తామన్నారన్నారు. చాలా చోట్ల కావాలని డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారన్నారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లడానికి తాను 20రోజుల నుంచి పార్టీ ఆఫీసు చుట్టూ తిరుగుతన్నా కూడా ఎవరూ పట్టించుుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.