Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికలకు ముందు జనసేనకు బిగ్ షాక్... పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నాయకురాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే మిగిలివుంది. ఇలాంటి కీలక తరుణంలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీకి షాక్ తగిలింది. దీంతో విశాఖ పట్నం జిల్లా జనసేనలో ఆందోళన మొదలయ్యింది. 

janasena leader guntur bharathi joins ysrcp
Author
Vizag, First Published Apr 5, 2019, 5:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే మిగిలివుంది. ఇలాంటి కీలక తరుణంలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీకి షాక్ తగిలింది. దీంతో విశాఖ పట్నం జిల్లా జనసేనలో ఆందోళన మొదలయ్యింది. 

సీనినటులు పవన్ కల్యాణ్ నూతన పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పటినుండి ఆయన వెంటేవున్న విశాఖ మహిళా నాయకురాలు గుంటూరు భారతి  హటాత్తుగా పార్టీ వీడనున్నట్లు ప్రకటించారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే జనసేనను వీడాలని భారతి నిర్ణంయించుకున్నారు. ఈ మేరకు పార్టీ మార్పుపై ఆమె అధికారిక ప్రకటన కూడా చేశారు. 

అనంతరం భారతి వైఎస్సార్‌సిపి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె వైసిపి కండువా కప్పుకున్నారు. భారతితో పాటు విశాఖ జిల్లాకు చెందిన మరికొంతమంది నాయకులు కూడా వైఎస్సార్‌సిపిలో చేరారు. 

ఏపి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మొదటివిడతలో భాగంగా ఈ నెల 11న జరగనున్నాయి. అందుకు ఇంకా కేవలం వారం రోజుల సమయమే మిగిలివున్న సమయంలో ఈ పరిణామం జనసేన పార్టీని దెబ్బతీసింది. ఇదే క్రమంలో విశాఖలో వైసిపి పార్టీకి భారతి రాకతో మరికొంత బలం పెరిగినట్లయింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios