Asianet News TeluguAsianet News Telugu

నాలాంటి వాళ్లు రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు: పవన్ కళ్యాణ్

తాను జనసేన పార్టీ పెట్టింది బీఎస్పీ పార్టీ, మాయావతి స్ఫూర్తితోనేనని స్పష్టం చేశారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, మాఫియా బ్యాక్ గ్రౌండ్, గొప్ప వారసత్వం కలిగిన వారే రాజకీయాలు ఏలాలనుకుంటున్నారని అందువల్లే తాను రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నట్లు తెలిపారు. మాయావతి ఒక సాధారణ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. 

janasena chief pawan kalyan comments on mayavathi
Author
Vijayawada, First Published Apr 3, 2019, 6:55 PM IST

విజయవాడ: రాజకీయాల్లో క్రిమినల్స్, అవినీతిపరులే ఏలుతున్నారని ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతితో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు. 

ఆ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు మాత్రమే రాజకీయాలు శాసిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్. 

యామావతిని అంతా బెహన్ జీ బెహన్ జీ అంటారు కానీ తనకు మాత్రం ఆమె మాతృమూర్తి అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను జనసేన పార్టీ పెట్టింది బీఎస్పీ పార్టీ, మాయావతి స్ఫూర్తితోనేనని స్పష్టం చేశారు. 

క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, మాఫియా బ్యాక్ గ్రౌండ్, గొప్ప వారసత్వం కలిగిన వారే రాజకీయాలు ఏలాలనుకుంటున్నారని అందువల్లే తాను రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నట్లు తెలిపారు. మాయావతి ఒక సాధారణ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. 

ఒక పోస్టల్ క్లర్క్ వ్యక్తి కుమార్తెగా జన్మించిన ఆమె ఇప్పుడు దేశానికే ఒక ఆదర్శవంతమైన నేతగా ఎదిగారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సామాన్య వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అంటే సామాన్య విషయం కాదని చాలా గగనం అయిపోయిందన్నారు. 

తాను రాజకీయాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటీష్ కట్టడాల గురించి మాట్లాడుతున్నామే తప్ప మన కట్టడాల గురించి మాట్లాడుకోలేకపోవడం బాధాకరమన్నారు. 

దేశానికి ఎన్నో సేవలందించిన గొప్ప వ్యక్తుల స్మారక చిహ్నాలను కట్టించిన ఏకైక నాయకురాలు మాయావతి అంటూ ప్రశంసించారు. మాయావతి స్ఫూర్తిని తీసుకుని మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. 

బహుజన సమాజ్ పార్టీ మాత్రమే స్వాతంత్ర్యం తర్వాత ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా రాజకీయాలు శాసిస్తున్న ఏకైక పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. భావజాలం బలంగా ఉంటే అంతా తేనెటీగలు లాగా మకరందాన్ని స్వీకరించి వెళ్లిపోతాయన్నారు. 

బీఎస్పీ ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ కాదని అగ్రవర్ణాలలోని పేదల కోసం పుట్టిన పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. ఒక సమాజం కోసం పెట్టిన పార్టీ కాదని అనేక మంది సమాజం కోసం పెట్టింది కాబట్టే బహుజన సమాజ్ పార్టీ అంటూ ప్రశంసించారు. 

కుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఆమె నాలుగుసార్లు సీఎం అయ్యారంటే అది సామాన్య విషయం కాదన్నారు. అడుగడుగునా సమస్యలు ఉన్న ఉత్తరప్రదేశ్ ను ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మాయావతి అంటూ చెప్పుకొచ్చారు. 

టీడీపీ ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోలీసుల చొక్కా పట్టుకున్న ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారని ఆరోపించారు. కానీ మాయావతి మాత్రం తనమన అనే బేధం లేకుండా అందర్నీ ఒకేలా చూసే వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు.  

Follow Us:
Download App:
  • android
  • ios