Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబూ! కాస్కో, నా రాజకీయం చూపిస్తా: పవన్ కళ్యాణ్ సవాల్

తనకు రాజకీయాలు తెలియవని విమర్శించిన చంద్రబాబు కు తన రాజకీయమేంటో చూపిస్తానని హెచ్చరించారు. చంద్రబాబు కాస్కో నా రాజకీయం చూస్తానంటూ సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిస్తే తనపైనే దాడులు చేయించారని మండిపడ్డాడు. 
 

janasena chief pawan kalyan comments on cm chandrababu
Author
Prakasam, First Published Mar 28, 2019, 9:46 AM IST

ప్రకాశం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తనకు రాజకీయాలు తెలియవని విమర్శించిన చంద్రబాబు కు తన రాజకీయమేంటో చూపిస్తానని హెచ్చరించారు. 

చంద్రబాబు కాస్కో నా రాజకీయం చూస్తానంటూ సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిస్తే తనపైనే దాడులు చేయించారని మండిపడ్డాడు. 

గత ఎన్నికల్లో మద్దతు తెలిపి అధికారం ఇప్పించిన తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి, అక్రమాలతో ఈ ఐదేళ్లూ విసిగిపోయామన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ గాలికొదిలేసిందని అందుకే ఈసారి మద్దతు ఇవ్వకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. 

అవినీతి సంపాదనతో వచ్చిన వేలాది కోట్లతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 18 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తాను అధికారింలోకి వస్తే జిల్లాలో ఒంగోలు గిత్తల అభివృద్ధి, వ్యవసాయానికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. 

యువ రైతులను తయారు చేస్తానని 6 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానంటూ భరోసా ఇచ్చారు. బాల్యంలో ఒంగోలులో ఉన్నానని జిల్లాను సొంత జిల్లాగా భావించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 

జనసేన అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని పవన్ కోరారు. సామాన్య ప్రజలు రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. డబ్బు, వారసత్వ రాజకీయాలను పారదోలాలనే ఉద్దేశంతో జనసేన సామాన్యులకు పట్టం కట్టిందని పవన్‌ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios