విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణను ప్రకటించారు. 

అలాగే పలు నియోజకవర్గాలకు శాసనసభ అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే మూడు దఫాలుగా పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మరో జాబితాను విడుదల చేశారు జనసేనాని.

జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా   

విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి - వి.వి.లక్ష్మీనారాయణ

విశాఖపట్నం ఉత్తరం                   -  -పసుపులేటి ఉషాకిరణ్ 
విశాఖపట్నం దక్షిణం                   - గంపల గిరిధర్ 
విశాఖపట్నం తూర్పు                    -కోన తాతారావు 
భీమిలి                                          - పంచకర్ల సందీప్ 
అమలాపురం                                 -శెట్టిబత్తుల రాజబాబు 
పెద్దాపురం                                   -తుమ్మల రామస్వామి(బాబు)
పోలవరం                                    -చిర్రి బాలరాజు
అనంతపురం                               -టి.సి.వరుణ్