అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన వైఎసీపీ చీఫ్  వైఎస్ జగన్‌ ఒక్కరే సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 30వ తేదీన విజయవాడలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్టు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రానికి రెండో సారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో తొలుత కేసీఆర్ తనతో పాటు మహమూద్ అలీతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు.ఇదే తరహాలో జగన్ వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది

ఈ నెల 30వ తేదీన కృష్ణా జిల్లా విజయవాడలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జగన్‌తో చర్చించారు. విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసే విషయమై అధికారులు, పార్టీ నేతలతో జగన్ వేర్వేరుగా చర్చించినట్టుగా తెలుస్తోంది.

జగన్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. తన కేబినెట్‌లో మంత్రులను ఆ తర్వాత ప్రమాణం చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ ప్రమాణస్వీకారం రోజున భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. దీంతో జగన్ ఒక్కరే ప్రమాణం చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయమై ఇంకా మరింత స్పష్టత రావాల్సి వచ్చే అవకాశం ఉంది.