అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విధంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. 

ఇప్పటికే వైసీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండటంతో తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. 

అత్యధికస్థానాల్లో లీడింగ్ లోవైసీపీ ఉన్న నేపథ్యంలో దాదాపు గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత వైయస్ జగన్ ఈనెల 25న శాసన సభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.