తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని.. వైసీపీ అధినేత జగన్ ఫాలో అవుతున్నారు. నిన్నటి వరకు ఈ ఇద్దరు నేతల మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అందరూ అనుకున్నారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో తాము జగన్ కి మద్దతుగా ఉంటామంటూ కేటీఆర్ ప్రకటించగా.. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని.. జగన్ కూడా ప్రశ్నించారు. దీంతో వీరి బంధం అందరికీ తెలసిపోయింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల సమయంలో మళ్లీ అధికారంలోకి రావాలనే కాంక్షతో కేసీఆర్  యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు.

నెల్లూరులో ఈ నెల 27వ తేదీ నుంచి వైసీపీ నేతలు శ్రీరాజ్య శ్యామల రాజ్యప్రద ఇంద్రయాగం నిర్వహిస్తున్నారు. కాగా.. శుక్రవారం ఈ యాగంలో వైఎస్  జగన్ కూడా పాల్గొన్నారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ...రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించారు.