విశాఖపట్టణం: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావును నియమిస్తూ ఆ పార్టీ  చీఫ్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవలనే  దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి  వైసీపీలో చేరారు. విశాఖ జిల్లాలో అనకాపల్లి సీటును దాడి కుటుంబానికి ఇస్తారని ప్రచారం సాగింది.కానీ దాడి కుటుంబానికి  టిక్కెట్టు దక్కలేదు. 

దాడి వీరభద్రరావుకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. జగన్ స్వయంగా దాడి వీరభద్రరావుకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. వైసీపీ అనకాపల్లి ఎంపీ సీటులో పరిశీలకుడిగా నియమించారు.