ఎన్నికల వేళ మంత్రి నారాయణ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజీ కార్యాలయంతో పాటు మంత్రి నారాయణ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

దాదాపు నాలుగు బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రేపో, మాపో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడంతో తెలుగుదేశం శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.