గుంటూరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రులలో ఐటీ అధికారులు దాడులకు దిగారు. 

గుంటూరులో ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడులపై సమాచారం అందుకున్న ఉగ్ర నరసింహారెడ్డి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 

అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసి ఆస్పత్రికి బయలుదేరినట్లు సమాచారం. ఇకపోతే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.  ఇలాంటి తరుణంలో టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్పత్రిలో ఐటీ అధికారులు సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.