ఏపీలో నగదు కొరత సృష్టించారని, రాష్ట్రానికి డబ్బు పంపించొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసిందని శివాజీ గుర్తు చేశారు. కేసీఆర్ హైదరాబాద్‌లో కూర్చొని ఆంధ్రా ప్రాంత పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్‌లో 35 లక్షల మంది ఏపీ వారున్నారని వారిలో మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటని శివాజీ ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థుల ఆశాసౌధాలపై కేసీఆర్ సొంత భవనాలను నిర్మించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు ఘటనలో తన పాత్ర లేదని కేసీఆర్ నిరూపించుకోగలరా అని శివాజీ ప్రశ్నించారు.  ఆంధ్రప్రదేశ్‌ను ఇబ్బందులకు గురిచేసే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌పై కొద్దిరోజుల క్రితం కేసీఆర్ ప్రభుత్వం కేసు వేసిందని శివాజీ గుర్తు చేశారు.

కేసీఆర్‌కు ఇష్టం లేని నేతలు ఏపీలో ఉంటే.. ఫ్యాక్షనిస్టులతో మాట్లాడుకుని వారిని చంపేయొచ్చు కదా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తెలంగాణ సీఎం ప్రయత్నిస్తున్నారని శివాజీ ధ్వజమెత్తారు.

సీ-విజిల్ ద్వారా జగన్ ఇంట్లో వందల కోట్లు ఉన్నాయని తాను చెబితే ఐటీ అధికారులు వెళ్లి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్న వారు ఆధారాలు చూపించినప్పటికీ సామాన్యులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.