మోదీ నిజంగా మగాడైతే తాను తిట్టే తిట్లకు సముద్రంలోకి దూకి చావాలని బాలయ్య వ్యాఖ్యానించారు. హిందూపురం నియోజకవర్గంలోని శ్రీకంఠపురం, లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ మోదీకి సిగ్గు, శరం లేవని మండిపడ్డారు. గతంలో ఆయన్ను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టానని చెప్పుకొచ్చారు.
హిందూపురం: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్రమోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నిజంగా మగాడైతే తాను తిట్టే తిట్లకు సముద్రంలోకి దూకి చావాలని బాలయ్య వ్యాఖ్యానించారు.
హిందూపురం నియోజకవర్గంలోని శ్రీకంఠపురం, లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ మోదీకి సిగ్గు, శరం లేవని మండిపడ్డారు. గతంలో ఆయన్ను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టానని చెప్పుకొచ్చారు.
కేసీఆర్, జగన్, మోదీ తననేమీ చెయ్యలేరంటూ పరుష పదజాలంతో దూషించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య డప్పు కొట్టి కార్యకర్తలను అలరించారు. సినీ డైలాగ్‌లుతో అందర్నీ ఆకట్టుకున్నారు. కరువు జిల్లా అయిన అనంతపురంలో పంటలు పండుతున్నాయంటే అది టీడీపీ చలవేనని చెప్పుకొచ్చారు.
తాను తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పుకొచ్చారు. త్వరలో విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన చిన్నల్లుడు శ్రీభరత్ పోటీ చేస్తున్నారు.
