Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఎన్నికలు: పోటీలో ఉన్న రక్తసంబంధీకులు, బంధువులు వీరే

ఈ ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీల నుండి  బంధువులు, రక్త సంబంధీకులు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల నుండి  పోటీలో  ఉన్నారు. 

here is names of the contested relatives from various parties
Author
Amaravathi, First Published Mar 29, 2019, 5:10 PM IST


అమరావతి:ఈ ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీల నుండి  బంధువులు, రక్త సంబంధీకులు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల నుండి  పోటీలో  ఉన్నారు. సమీప బంధువులు కూడ వేర్వేరు పార్టీల నుండి పోటీ చేస్తుండగా, కొందరైతే ఒకే పార్టీ నుండి వేర్వేరు స్థానాల నుండి  బరిలో నిలిచారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నుండి బరిలోకి దిగితే ఆయన తనయుడు నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తున్నారు. బాలకృష్ణ లోకేష్ కు మామ. బాబుకు బావమరిది. దగ్గుబాటికి కూడ బాలయ్య బావమరిది అవుతారు.జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేస్తుండగా ఆయన సోదరుడు నాగబాబు నర్సాపురం నుండి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు

విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుండి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇదే జిల్లాలోని గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్లలో తోడల్లుడు అప్పలనాయుడులు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడ వైసీపీ నుండి  బరిలో నిలిచారు.

విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుండి అవంతి శ్రీనివాస్ బరిలో నిలిచారు.  అవంతి శ్రీనివాస్ సోదరుడు ముత్తంశెట్టి కృష్ణారావు కృష్ణా జిల్లా ఆవనగడ్డ అసెంబ్లీ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగాడు. 

శ్రీకాకుళం  నుండి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బరిలో దిగితే ఆయన సోదరుడు కృష్ణదాస్ నరసన్నపేటలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆముదాలవలసలో వైసీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పోటీ చేస్తున్నారు. ఆయన బావమరిది కూన రవికుమార్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రవికుమార్ ఈ స్థానం నుండి విజయం సాధించారు.  మరో వైపు ఇదే స్థానం నుండి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

విశాఖ జిల్లా మాడ్గులలో టీడీపీ అభ్యర్ధి గవిరెడ్డి రామానాయుడుపై ఆయన సోదరుడు సన్యాసినాయుడు జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడ వరసకు బాబాయి, అబ్బాయి అవుతారు.

గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ అభ్యర్థి కిలారు రోశయ్య వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు అవుతారు. ప్రకాశం జిల్లా పర్చూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరీ బీజేపీ అభ్యర్థిగా విశాఖ ఎంపీ స్థానం నుండి పోటీ చే్స్తున్నారు. పురంధేశ్వరీ సోదరుడు బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోడల్లుడు చంద్రబాబునాయడు కుప్పం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నుండి టీడీపీ అభ్యర్ధిగా  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన బావ మరిది నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా కోవూరు నుండి పోటీ చేస్తున్నారు. 

కడప ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు సోదరుడు అవుతాడు. జగన్ పులివెందుల నుండి పోటీ చేస్తున్నారు. రైల్వేకోడూరు నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నరసింహ ప్రసాద్ చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు అల్లుడు. వీరిద్దరూ కూడ టీడీపీ  నుండే పోటీ చేస్తున్నారు. 

చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ అభ్యర్థి అనీషారెడ్డి మంత్రి అమర్ నాథ్ రెడ్డి సోదరుడి భార్య. అమర్ నాథ్ రెడ్డి పలమనేరు నుండి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 

కర్నూల్ జిల్లా బనగానపల్లె నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటసాని రాంరెడ్డి నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి మామ. పాణ్యం నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి  వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. కాటసాని రాంరెడ్డి, రాంభూపాల్ రెడ్డిలు కూడ సోదరులు అవుతారు.అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్మవరం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి బాబాయ్ అవుతారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios