తప్పు చేశాను దేవుడు శిక్షించాడు, జగన్ కి నా సెల్యూట్: ఫిరాయింపు మాజీ ఎమ్మెల్యే ప్రశ్చాత్తాపం (వీడియో)
భగవంతుడు ఉన్నాడని తప్పు చేసిన వాళ్లని తప్పక శిక్షిస్తాడని అలాగే తనను శిక్షించాడని చెప్పుకొచ్చారు గూడూరు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్. తాను తప్పు చేశానని అందుకు ప్రజలు శిక్షించారని చెప్పుకొచ్చారు.
నెల్లూరు: భగవంతుడు ఉన్నాడని తప్పు చేసిన వాళ్లని తప్పక శిక్షిస్తాడని అలాగే తనను శిక్షించాడని చెప్పుకొచ్చారు గూడూరు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్. తాను తప్పు చేశానని అందుకు ప్రజలు శిక్షించారని చెప్పుకొచ్చారు.
గూడూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సునీల్ కుమార్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తన ఓటమిపై స్పందించారు. తాను ఓడిపోవడం వల్ల బాధపడటం లేదన్నారు.
ఈపోటీ తనకి ఎమ్మెల్యే వరప్రసాద్ కి మధ్య జరగలేదని చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ ల మధ్య జరిగిందని అందువల్లే తనను బాధపడొద్దని చాలామంది సూచిస్తున్నారని తెలిపారు. తాను ఎన్ని చేసినా వైయస్ జగన్ ప్రభంజనం ముందుకు కొట్టుకుపోయాయని చెప్పుకొచ్చారు.
రాష్ట్రప్రజలు వైయస్ జగన్ ను కోరుకుంటున్నారని అందుకే ఆయనకు పట్టం కట్టారన్నారు. వైయస్ జగన్ పోరాటానికి తాను సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. గూడూరు నియోజక వర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వరప్రసాద్ కి, వైయస్ కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బుద్ధి తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ నేతలు మారకపోతే భవిష్యత్ లో చాలా కష్టమన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.
వైయస్ జగన్ మంచి పరిపాలన అందించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2014 ఎన్నికల్లో గెలిచారు సునీల్ కుమార్. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అందువల్ల తాను తప్పు చేశానని అందుకు దేవుడు శిక్షించాడంటూ వేదాంతం మాట్లాడుకొచ్చారు.
"