అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రింగా కొన్ని రోజుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో అధికారులు ఆయన్ను కలుసుకునేందుకుు క్యూ కడుతున్నారు. 

ఇప్పటికే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వైయస్ జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం సీఎస్ గా కొనసాగింపు అంశంపై ఇరువురు మధ్య చర్చ కూడా జరిగింది. 

ఈ సందర్భంగా వైయస్ జగన్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సీఎస్ గా కొనసాగాలని ఆదేశించారు. తాజాగా  సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ సైతం వైయస్ జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. 

డీజీపీ రేసులో గౌతం సవాంగ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే జగన్ ను కలిసి ఉంటారంటూ సమాచారం. ప్రస్తుతానికి గౌతమ్ సవాంగ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. 

ప్రస్తుతం ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ కేంద్రసర్వీసులకు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే శుక్రవారం అఖిలభారత ఉద్యోగులు సైతం వైయస్ జగన్ ను కలవనున్నారు. శుక్రవారం నుంచి మరింత మంది ఉన్నతాధికారులు జగన్ ఇంటికి క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదు.