అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 25 వేల ఓట్ల ఆధిక్యంలో మాధవ్ దూసుకెళ్తున్నారు. కాగా ఇక్కడ్నుంచి నిమ్మల క్రిష్టప్ప టీడీపీ తరఫున పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన నిమ్మల గెలుపొందారు. 

గోరంట్ల మాధవ్ తన సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి  వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  కాగా... అతనికి  వైఎస్ జగన్‌ ఎంపీ టికెట్ ఇచ్చారు. హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న సీఐ గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు రిలీవింగ్ వ్యవహారం అడ్డుపడి అప్పట్లో పెద్ద వ్యవహారమే నడిచిన సంగతి తెలిసిందే.