మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ తనయుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని సమాచారం.

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ తనయుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని సమాచారం.

మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ వారం రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.ఈ దఫా ఎన్నికల్లో రాజంపేట నుండి ఎంపీ సీటును సాయిప్రతాప్ ఆశించారు. కానీ ఆయనకు బదులుగా డీకే సత్యప్రభకు చంద్రబాబునాయుడు టిక్కెట్టును కేటాయించారు.

దీంతో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోకి తనను ఆహ్వానించి అవమానించారని కూడ ఆయన ఆరోపణలు చేశారు. వైసీపీలో చేరేందుకు సాయిప్రతాప్ రంగం సిద్దం చేసుకొంటున్నారని తెలుస్తోంది.

మరోవైపు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు కూడ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది. హర్షకుమార్ ఇటీవలనే టీడీపీకి రాజీనామా చేశారు. రెండు వారాల క్రితం హర్షకుమార్ టీడీపీలో చేరారు.అమలాపురం ఎంపీ టిక్కెట్టును జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌కు చంద్రబాబునాయడు కేటాయించారు. దీంతో హర్షకుమార్ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ తరుణంలో హర్షకుమార్ తనయుడు కూడ వైసీపీలో చేరాలని భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.