ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపారమైన విశ్వాసాన్ని చూపారు.. ప్రజలు, రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నా... వైఎస్ ఖచ్చితంగా గర్వపడే రోజు ఇది’’ అని ప్రణబ్ ట్వీట్ చేశారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ప్రణబ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక జగన్ ఈ నెల 30న విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.