హైదరాబాద్: మాజీ యూత్‌ కాంగ్రెస్‌ నేత తాడిశెట్టి  వెంకట్రావ్‌ ఆయన సోదరుడు మురళీ మంగళవారం  నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టి. వెంకట్రావ్ యూత్ కాంగ్రెస్ లీడర్‌గా ఉన్నారు. దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా వెంకట్రావ్ కొనసాగారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గుంటూరు సిటీ నుండి  ఆయన  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  మంగళవారం నాడు ఉదయం  వెంకట్రావ్ ఆయన సోదరుడు మురళి జగన్‌తో భేటీ అయ్యారు. జగన్ వీరిద్దరకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.