హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గురువారం నాడు వైసీపీలో చేరారు.  హైద్రాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్ సమక్షంలో లబ్బి వెంకటస్వామి వైసీపీలో చేరారు. 

నందికొట్కూరు నుండి లబ్బి వెంకటస్వామి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. లబ్బి వెంకటస్వామితో పాటు గురు రాఘవేంద్ర బ్యాంకు కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు దస్తగిరి రెడ్డి కూడ వైసీపీలో చేరారు. వీరిద్దరికి జగన్  వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

వచ్చే ఎన్నికల్లో  రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేందుకు తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని లబ్బి వెంకటస్వామి ప్రకటించారు.ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో బాబు వైఫల్యం చెందారని లబ్బి చెప్పారు.