మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సోమవారం నాడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు

అమరావతి: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సోమవారం నాడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. వైసీపీలో కొణతాల చేరుతారని ప్రచారం సాగినా ఆయన ఆ పార్టీలో చేరలేదు ఈ తరుణంలో కొణతాల రామకృష్ణ మరోసారి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 16వ తేదీన కొణతాల రామకృష్ణ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో వైసీపీలో కొణతాల రామకృష్ణ చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, కొణతాల రామకృష్ణ మాత్రం వైసీపీలో చేరలేదు. ఉత్తరాంధ్ర సమస్యలపైనే తాను జగన్‌తో చర్చించినట్టుగా ప్రకటించారు.

ఈ నెల 17వ తేదీన కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ, ఆయన మాత్రం టీడీపీలో చేరలేదు. సోమవారం నాడు చంద్రబాబుతో కొణతాల రామకృష్ణ అరగంటలకు పైగా చర్చించారు. 

నాలుగు రోజుల క్రితం తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన సమయంలో తాను ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తానని కొణతాల రామకృష్ణ ప్రకటించారు.అయితే కొణతాల టీడీపీలో చేరడం కోసమే బాబుతో భేటీ అయ్యారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.