Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ న్యూస్ నమ్మి.. ఓటు కోసం ఉదయం నుంచి క్యూలో..

సోషల్ మీడియాలో రోజుకి కొన్ని వందల న్యూస్ లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువ శాతం ఫేక్ వార్తలే ఉంటాయి. ఆ ఫేక్ న్యూస్ ని నమ్మవద్దని పోలీసులు, అధికారులు ఎంత మొత్తుకున్నా.. జనం మాత్రం వాటినే ఫాలో అవుతున్నారు.

fake news effect...gajuvaka citizens set queue line at GVMC office
Author
Hyderabad, First Published Apr 10, 2019, 2:29 PM IST

సోషల్ మీడియాలో రోజుకి కొన్ని వందల న్యూస్ లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువ శాతం ఫేక్ వార్తలే ఉంటాయి. ఆ ఫేక్ న్యూస్ ని నమ్మవద్దని పోలీసులు, అధికారులు ఎంత మొత్తుకున్నా.. జనం మాత్రం వాటినే ఫాలో అవుతున్నారు. కాగా.. ఇలాంటి ఓ ఫేక్ న్యూస్ కారణంగా గాజువాకలో గందరగోళం నెలకొంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఓటు లేని వారంతా ఫారం 27ని ఉపయోంచి ఓటు పొందవచ్చు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానిని నిజమని నమ్మిన గాజువాక వాసులు.. బుధవారం ఉదయం ఫారం 27 కోసం జీవీఎంసీ ఆఫీసు ముందు క్యూ కట్టారు. వందల సంఖ్యలో ప్రజలు ఆఫీసు ముందు లైన్ లో నిల్చున్నారు.

అక్కడికి వెళ్లాక కానీ.. వారందరికీ తెలియలేదు.. వారి చదివింది ఫేక్ న్యూస్ అని. వారందరికీ సర్థిచెప్పలేక జీవీఎంసీ అధికారుల తల ప్రాణం తోకకి వచ్చింది. 

కాగా ఫేక్‌ వార్తలను షేర్‌ చేసిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశంఉంది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా మూడు లక్షలకు పైగా ఓట్లతో గాజువాక  మొదటి స్థానంలో నిలిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios