రాజకీయాల నుంచి దూరమైనప్పటికీ పొలిటికల్‌గా యాక్టీవ్‌గానే ఉన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. వివిధ ఎన్నికలపై సర్వేలు చేయిస్తూ.. రాజకీయంగా తన విశ్లేషణలు అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు
రాజకీయాల నుంచి దూరమైనప్పటికీ పొలిటికల్‌గా యాక్టీవ్‌గానే ఉన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. వివిధ ఎన్నికలపై సర్వేలు చేయిస్తూ.. రాజకీయంగా తన విశ్లేషణలు అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా ఏపీ ఎన్నికలపై ఆయన స్పందించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు మరోసారి అనుభవజ్ఞులకే పట్టం కడతారని లగడపాటి వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర భవిష్యత్ రీత్యా అనుభవజ్ఞుల అవసరం ఉందన్నారు. ఓటేసేముందు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ప్రజలు చూస్తారని చెప్పారు. మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు.
ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు పరోక్షంగా లగడపాటి సంకేతాలిచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీ ఎన్నికలపై పలు జాతీయ ఛానెళ్లు ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో.. లగడపాటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
