ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీని వీడారు. గురువారం మాజీ ఎంపీ హర్షకుమార్ ఫ్యాన్ గూటికి చేరారు. 

ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీని వీడారు. గురువారం మాజీ ఎంపీ హర్షకుమార్ ఫ్యాన్ గూటికి చేరారు. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో హర్షకుమార్‌, ఆయన కుమారుడు శ్రీహర్ష వైసీపీలో చేరారు. 

జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అమలాపురం సీటు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఆ సీటు దక్కకపోవడంతో మనస్తాపంతో టీడీపీకి దూరమయ్యారు