ఎన్నికల షెడ్యుల్ విడుదలవ్వడంతో... రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు  వేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల పేరును ఖరారు చేయడంలో వ్యూహాలు రచిస్తున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో.. అమలాపురం టికెట్ ని మాజీ ఎంపీ హర్షకుమార్ కి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం.

అమలాపురం లోక్‌సభ నియోజకవర్గస్థానంనుంచి మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకుంది. ఈ విషయమై జిల్లాలో ఉన్న సిటింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గ పరిధిలోని ఎంపిక చేసిన అభ్యర్థులనుంచి అభిప్రాయాలు సేకరించి ఆయన అభ్యర్థిత్వంపై అధిష్ఠానం మక్కువ చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హర్షకుమార్‌ పేరు ఖరారయ్యే సూచనలున్నాయని పార్టీ వర్గీయుల ద్వారా సమాచారం. 

ఇక అమలాపురం లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా చింతా అనూరాధ ను ఖరారు చేయాని వైసీపీ యోచిస్తోంద. ఆమె అసెంబ్లీ స్థానం అడుగుతున్నప్పటికీ.. ఎంపీ సీటు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే జనసేన లోక్‌సభ అభ్యర్థిగా రాజమహేంద్రవరం ఓఎన్జీసీ అసెట్‌ మేనేజర్‌గా పనిచేసిన డీఎంఆర్‌ శేఖర్‌ పేరును ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం ప్రకటించారు.