పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య జోస్యం చెప్పారు. 

పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య జోస్యం చెప్పారు. భీమవరం నుంచి పవన్‌ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని, రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌ లేదా కింగ్‌ మేకర్‌లా నిలుస్తారని అన్నారు. 

ఎన్నికలలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే టీడీపీ, వైసీపీలకు(ఒక్కొక్క పార్టీకి) 90 స్థానాలకంటే ఎక్కువ వచ్చే అవకాశం కనిపించడం లేదని జోగయ్య విశ్లేషించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కీలక పాత్ర వహిస్తారని పేర్కొన్నారు.