గుంటూరు: ఐదు రోజుల క్రితమే ఆయన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు. ఇంతలోనే ఆయన ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారు. ఆయన ఎవరో కాదు, గుంటూరు జిల్లా రేపల్లే మాజీ శాసనసభ్యుడు దేవినేని మల్లిఖార్జున రావు. 

దేవినేని మల్లిఖార్జున రావు జనసేనకు రాజీనామా చేయనున్నారు. గురువారం సాయంత్రం ఆయన వైఎస్సార్ కాంగ్రెెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.దేవినేనితో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, మేరుగ నాగార్జున చర్చలు జరిపారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో దేవినేని పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దేవినేని తన అనుచరులు, కుటుంబీకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 
 
రేపల్లె నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ తరఫున పోటి చేసి దేవినేని మల్లిఖార్జునరావు విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత మల్లిఖార్జునరావు టీడీపీకి మద్దతిచ్చారు.జనసేన తరఫున రేపల్లె నియోజకవర్గం నుంచి కమతం సాంబశివరావు పోటీ చేస్తున్నారు.