Asianet News TeluguAsianet News Telugu

మీదేమైనా రాజకుటుంబమా: బొజ్జల సుధీర్‌పై మాజీ ఎమ్మెల్యే ఫైర్

ఎన్నికల ప్రచారంలో నేతలు వ్యక్తిగత విమర్శలు దిగుతూ పొలిటీకల్ హీట్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు మండిపడ్డారు. 

EX MLA SCV Naidu fires on bojjala sudhir reddy
Author
Srikalahasti, First Published Apr 3, 2019, 12:41 PM IST

ఎన్నికల ప్రచారంలో నేతలు వ్యక్తిగత విమర్శలు దిగుతూ పొలిటీకల్ హీట్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు మండిపడ్డారు.

సుధీర్ నోరు అదుపులో పెట్టుకోవాలని... చిన్నవాడు, భవిష్యత్ ఉన్నవాడు పెద్దలను గౌరవించి మాట్లాడటం నేర్చుకోవాలని నాయుడు సూచించారు. ‘‘ మీ ఆరోపణలు స్వీకరిస్తున్నా... ఎవరి వద్ద కమీషన్లు తీసుకున్నానో నిరూపించు, బహిరంగ చర్చకు సిద్ధమని ఎస్‌వీవీ సవాల్ విసిరారు.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆయన తండ్రి గంగసుబ్బరామిరెడ్డిని శ్రీకాళహస్తిలోకి రానీయకుండా అడ్డుకున్నప్పుడు తాను వారికి అండగా నిలిచానన్నారు. పార్టీని నమ్ముకుంది తామని.. సొమ్ము చేసుకుంది మీరని మండిపడ్డారు.

మీరేమైనా రాజుల కుటుంబం నుంచి వచ్చారా..? మీ తాత ఓ కాంట్రాక్టర్.. అది తెలుసుకో, మేము మీ కింద పనిచేసే గుమస్తాలం కాదని నాయుడు ధ్వజమెత్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios