హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచిదేనని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. ప్రజల ఆశీర్వాదం, దేవుని దయతో ఏప్రిల్‌ 11న జరిగే సార్వత్రికల్లో వైసీపీ గెలిచి వైఎస్‌ జగన్‌ సీఎం అయితే మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. 

గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి రూపొందించిన వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు ఆడియో, వీడియో సాంగ్ ని రోశయ్య తన నివాసంలో ఆవిష్కరించారు. 

ప్రజల కోసం ఆనాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు వైఎస్ జగన్ పై ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడిందని స్పష్టం చేశారు. 

ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయనతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని రోశయ్య గుర్తు చేశారు. వైఎస్సార్‌ మాదిరిగానే ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ కూడా ఎంతో కష్టపడుతున్నారని అభిప్రాయపడ్డారు రోశయ్య.