రాజకీయ నేతల వెంట ఉండి వారి హంగు, ఆర్బాటాలు, అధికార దర్పాన్ని చూసిన ఎంతో మంది ఉన్నతాధికారులు రాజకీయాల్లోకి వచ్చిన ఉదంతాలు మనం ఎన్నో చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికల్లో దాదాపు 20 మంది అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, గ్రూప్-1 మాజీ అధికారులు  పోటీ చేస్తున్నారు.

పదవి విరమణ చేసిన వారు, వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న వారు, పోలీస్ ఉన్నతాధికారులు వివిధ పార్టీల తరపున ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 

పోటీ చేస్తున్న అధికారుల  వివరాలు:

వీవీ లక్ష్మీనారాయణ ఐపీఎస్- జనసేన (విశాఖ లోక్‌సభ)

తోట చంద్రశేఖర్ ఐఏఎస్ - జనసేన ( గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం)

మెట్ట రామారావు ఐఆర్ఎస్ - జనసేన ( శ్రీకాకుళం  లోక్‌సభ)

పార్థసారథి ఐఆర్ఎస్ - జనసేన (అనకాపల్లి లోక్‌సభ)

రావెల కిశోర్ బాబు ఐఆర్‌టీఎస్ - జనసేన (ప్రత్తిపాడు అసెంబ్లీ)

మాల్యాద్రి ఐఆర్ఎస్ - టీడీపీ (బాపట్ల లోక్‌సభ)

రామాంజనేయులు  ఐఏఎస్ - (కోడుమూరు అసెంబ్లీ)

ఇక్బాల్  అహ్మద్ ఖాన్ ఐపీఎస్ - వైసీపీ ( హిందూపూర్ అసెంబ్లీ)

చంద్రగిరి యేసురత్నం ఐపీఎస్- గుంటూరు పశ్చిమ