హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం నాడు విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థులు ఇవాళ్టి నుండి నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు.

ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది.ఈ నెల 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.  ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. మే 23వ తేదీన కౌంటింగ్ జరుగుతోంది.