అమరావతి: అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, సిపిఐ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. 

ఫిర్యాదు స్వీకరించిన అధికారులు జేసీ ఎన్నికల కోడ్ ఉల్లఘించారని నిర్ధారించారు. దీంతో దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. చట్టప్రకారం చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.
 
జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఎన్నికకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని జేసీ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు జేసీ బ్రదర్స్ ప్రతిస్పందన ఏమిటనేది తెలియదు.