అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కులపరమైన వ్యాఖ్యలు చేసినందుకు సినీ నటుడు పోసాని కృష్ణమురళి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది.

తమ ఎదుట హాజరుకావాలని ఈసీ పోసాని కృష్ణమురళిని ఆదేశించింది. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనకు ఈసీ నోటీసు జారీ చేసింది.
 
ఎన్నికల సంఘం ఇచ్ిచన నోటీసులపై పోసాని కృష్ణమురళి స్పందించారు. ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో  స్పష్టం చేశారు. తాను నడవలేని స్థితిలో ఉన్నానని, ఆపరేషన్‌ కోసం యశోదా ఆస్పత్రిలో చేరానని తెలిపారు.