వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో  తాను కూడా పోటీ చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నుంచి పవన్ కి పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతానని ఆయన పేర్కొన్నారు. 

అదేంటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది కదా.. ఇప్పుడు ఆర్జీవీ పోటీ చేస్తానంటాడేంటి అనే సందేహం అందరికీ కలుగే ఉంటుంది. అందుకే దానికి కూడా ఆర్జీవీ తన దైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు.

 ఇప్పటికే నామినేషన్ల గడువు ముగిసినా తనకు పై స్థాయి నుంచి పోటి చేసేందుకు పర్మిషన్‌ వచ్చిందని, పూర్తి వివరాల కోసం వేచి ఉం‍డాలంటూ ట్వీట్ చేశాడు వర్మ. గతంలోకూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ.. ఆర్జీవీ ట్వీట్లు చేశారు. ఆ తర్వాత కొంతకాలంగా వాళ్ల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ ఇలా మొదలుపెట్టారు.