హైదరాబాద్: నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ఖండించారు. ఈ విషయంలో ఆయన జగన్ కు బాసటగా నిలిచారు. 

తన తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్‌కు రూ. 1500 కోట్లు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడ్డారని నేషనల్ ఫరూక్ అబ్దుల్లా ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణను దాసోజు శ్రవణ్ ఖండించారు. 

తన తండ్రి మరణం తర్వాత తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలు సేకరించడంతో పాటు జగన్ అనేక ప్రయత్నాలు చేసిన మాట నిజమేనని, అయితే కాంగ్రెస్‌కు రూ. 1500 కోట్లు ఆఫర్ చేశాడనేది నిరాధారమైన ఆరోపణ ఆయన అన్నారు.
 
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంపై అప్పటి క్లిష్టపరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంచి నిర్ణయం తీసుకున్నారని, పార్టీ సీనియర్ అయిన రోశయ్యను ఎంపిక చేశారని ఆయన గుర్తు చేశారు.