ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్ధి విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారు. తొలుత ఇక్కడి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరావు, పురంధేశ్వరిల కుమారుడు హితేశ్ చెంచురామ్‌ని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు.

ఆ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్‌లు వైసీపీలో చేరారు. అయితే హితేశ్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. భారతదేశ ఎన్నికల్లో పోటీ చేయాలంటే విదేశాల్లో ఉన్న పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాల్సి ఉన్నందున హితేశ్ ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు.

అయితే ఇంకా పూర్తికానందున హితేశ్‌కు బదులుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావునే పరుచూరు నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్మోహన్‌రెడ్డి కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.