ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. కాగా... ఈ ఎన్నికల ఫలితాలను వైసీపీ అధినేత జగన్ తన నివాసం నుంచే పర్యవేక్షిస్తున్నారు.

బుధవారం సాయంత్రం భార్య భారతితో కలిసి జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి  చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం విజయమ్మ కూడా నివాసానికి చేరుకున్నారు. వీరితో పాటు ప్రశాంత్ కిశోర్ కూడా ఎన్నికల ఫలితాలను జగన్ నివాసంలోనే వీక్షించనున్నారు. ఇదిలా ఉండగా... విజయం తమనే వరిస్తుందని...ఇప్పటికే వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలైన విజయం ఎవరిదనే విషయం తెలియాలంటే మరి కొద్ది గంటలు ఎదురుచూస్తే సరిపోతోంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.