హైదరాబాద్: ఏపీ రాష్ట్రానికి జగన్  సీఎం అవుతారని  సినీ నటి జయసుధ అభిప్రాయపడ్డారు. టీడీపీకి గుడ్ బై చెప్పి ఆమె వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు వైసీపీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. 

గురువారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.తాను 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీలో చాలామందిని ఒప్పించారని  జయసుధ గుర్తు చేసుకొన్నారు. 

 తాను 2009లో రాజకీయాల్లోకి వచ్చే సమయంలో తనకు ఏమీ తెలియదన్నారు. కానీ వైఎస్ఆర్ ఏం చెబితే అదే చేశానని చెప్పారు. ఈ దఫా వైఎస్ జగన్ చెప్పినట్టుగానే  తాను నడుస్తానని చెప్పారు.

వైసీపీలోకి రావడం తన స్వంత ఇంటికి   వచ్చినట్టుగా ఉందని ఆమె చెప్పారు.  తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదన్నారు. సినీ రంగానికి చెందిన వాళ్లు జగన్‌‌ను  కలవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. జగన్‌ను కలవడంలో సినీ ఆర్టిస్టులు కలవడంలో తప్పేమీలేదన్నారు.

తెలంగాణలో లేదా హైద్రాబాద్‌లో ఆస్తులు ఉన్న టీడీపీ నేతలను కేసీఆర్ భయబ్రాంతులకు గురిచేసి వైసీపీలో చేరేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని బాబు వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు గుర్తు చేశారు. అయితే తనకు తెలంగాణలో వ్యాపారాలు కానీ, పెద్ద ఎత్తున ఆస్తులు లేవని ఆమె చెప్పారు. తాను ఓ సినీ నటిని మాత్రమేనని ఆమె  చెప్పారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఝలక్: వైసీపీలోకి జయసుధ