కుప్పం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ బరిలోకి దింపింది. వరుసగా రెండోసారి చంద్రమౌళి బరిలోకి దిగుతున్నాడు. గత ఎన్నికల్లో కూడ చంద్రమౌళి చంద్రబాబు చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

1989 నుండి కుప్పం నుండి చంద్రబాబునాయుడు విజయం సాధిస్తున్నారు. మరోసారి ఇదే స్థానం నుండి చంద్రబాబునాయుడు బరిలోకి దిగుతున్నాడు. గత ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి. 

ఆ ఎన్నికల్లో తొలిసారిగా మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు. తొలిసారి చంద్రబాబునాయుడుపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు 47 వేల మెజారిటీతో విజయం సాధించారు. మరోసారి చంద్రమౌళి చంద్రబాబుపై పోటీకి దిగుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో చంద్రబాబుపై కాంగ్రెస్ అభ్యర్ధి సుబ్రమణ్యరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.