అమరావతి: ఏపీ ఎన్నికల్లో  ప్రజలిచ్చిన తీర్పును ఆమోదిస్తున్నాం... ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ చీఫ్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన మోడీని కూడ ఆయన అభినందించారు.

గురువారం నాడు  ఎన్నికల ఫలితాల అనంతరం  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల  ఫలితాలపై సమీక్షించి  నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇప్పటికిప్పుడే తాను ఏమీ మాట్లాడనని ఆయన చెప్పారు. పార్టీ సమీక్షలు నిర్వహించిన తర్వాతే తమ పార్టీ కార్యక్రమాన్ని వెల్లడిస్తానని బాబు ప్రకటించారు.

మరో వైపు ఒడిశాలో ఐదోసారి సీఎంగా విజయం సాధించిన నవీన్ పట్నాయక్‌ను కూడ చంద్రబాబునాయుడు అభినందించారు. సహజ ధోరణికి భిన్నంగా చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో క్లుప్తంగా మాట్లాడారు. సాధారణంగా చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ పెడితే కనీసం గంటలకు పైగా మాట్లాడుతారు.కానీ, ఐదు నిమిషాలలోపుగానే చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ ముగించారు.