అమరావతి: రేపు ఉదయం తిరుపతి నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం నాడు ఉదయం చంద్రబాబునాయుడు తిరుపతికి చేరుకొంటారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొంటారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

తిరుపతిలో సేవా మిత్ర, బూత్ కమిటీ సభ్యులతో చంద్రబాబునాయుడు పాల్గొంటారు. శ్రీవారి దర్శనం తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన నేతలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత  చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సభలో పాల్గొంటారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సభ తర్వాత తొలి రోజు ఎన్నికల ప్రచారం పూర్తి కానుంది. ఈ నెల 17వ తేదీన విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో  చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.

ఈ నెల18వ తేదీన నెల్లూరు, గుంటూరు, ప్రకాశం , కృష్ణా జిల్లాల్లో ఎన్నికల సభల్లో బాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 19వ తేదీన కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల్లో ఎన్నికల సభల్లో బాబు పాల్గొంటారు.ఆయా జిల్లాల్లోని ఎన్నికల సభలు పూర్తి చేసిన బస్సు యాత్ర చేయాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.