అమరావతి: వైసీపీపై ఏనీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. గెలిచేస్తున్నాం.... వచ్చేస్తాం ఎక్కడికి వస్తారంటూ  బాబు వైసీపీపై  వ్యంగ్యాస్త్రాలను సంధించారు. 

బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిపాలనను కేంద్రం చేతిలో జగన్ ఆశపడుతున్నాడని చంద్రబాబునాయుడు ఆరోపించారు.వచ్చేస్తామంటున్నారు.... ఎక్కడికి వస్తారని ఆయన ప్రశ్నించారు. ఎక్కడికి వచ్చేస్తారు.....  ఆయాసం తప్ప మరేమీ ఉండదు... వచ్చేస్తామని  వసూలు చేసుకొంటున్నారని వైసీపీపై విమర్శలు చేశారు.

వైసీపీ నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. జనం ఇప్పటికే తీర్పు ఇచ్చేశారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. పోలింగ్ అవగానే జగన్  హైద్రాబాద్ ‌కు వెళ్లిపోయాడన్నారు.అంతేకాదు విహారయాత్ర చేసుకొంటాడని ఆయన జగన్‌పై విమర్శలు చేశారు.

ఎన్నికల నిర్వహణ వరకు మాత్రమే ఈసీ పనిచేస్తోందన్నారు. జూన్ 8వ తేదీన తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశానని అప్పటివరకు రాష్ట్రంలో ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నారు.

రాష్ట్రంలో అపద్ధర్మ ప్రభుత్వం పాలన సాగించడంలో తప్పు ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం పాలన సాగించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. 

తమ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టకూడదన్నారు. కానీ సాధారణ పాలన విషయంలో ఇబ్బందులు ఉండవన్నారు. తప్పుడు ప్రచారం చేయడం మినహా వైసీపీకి మరో ధ్యాస లేదని  ఆయన విమర్శలు గుప్పించారు.