సాలూరు: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై పెట్టిన కేసుల విసయమై మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నోరు తెరవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. జగన్ కేసుల విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలని ఆయన కోరారు.

విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జనసేన తరపున మాజీ సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ విశాఖ నుండి పోటీ చేస్తున్నారని ఆయన ప్రస్తావించారు.

సీబీఐలో  లక్ష్మీనారాయణ జేడీగా పనిచేస్తున్న సమయంలో  జగన్‌పై కేసులు పెట్టాడని ఆయన గుర్తు చేశారు. జగన్ ‌పై ఆనాడూ 14 కేసులు పెట్టాడని చెప్పారు. ఆ కేసుల్లో వాస్తవం ఉందా లేదా చెప్పాలన్నారు. ఈ కేసులో వాస్తవాలు ఏమిటో చెప్పాలని ఆయన కోరారు. ప్రజలకు జగన్‌ గురించిన వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.