అమరావతి: ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పు దేశానికి దిక్సూచిగా మారనుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజల దృష్టంతా ఏపీపైనే ఉందన్నారు.

శుక్రవారం నాడు ఆయన టీడీపీ నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక హోదాకు 22 పార్టీలు అండగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో మంత్రులపై ఐటీ దాడులు బీజేపీ వేధింపులకు పరాకాష్టగా ఆయన అభిప్రాయపడ్డారు.వైసీపీ ప్రలోభాలకు, బీజేపీ, టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడబోమన్నారు. 

.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.ఎన్టీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సీఎం సూచించారు. 38ఏళ్లుగా టిడిపిని గుండెల్లో పెట్టుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో, దేశంలో సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్‌. పేదలే దేవుళ్లుగా టీడీపీ చేసే సంక్షేమానికి ఎన్టీఆర్ ఆశీస్సులు. సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.