అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీన సమావేశం కానున్నారు.  పోలింగ్ ట్రెండ్‌పై అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 22వ తేదీన 175  అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని  చంద్రబాబు నాయుడు సూచించారు.

విపక్షం సూచించినట్టుగానే ఈసీ వ్యవహరించిందని పీలేరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.మరో వైపు 17 సీ ఫామ్స్‌ తీసుకోవాలని బాబు పోటీ చేసిన అభ్యర్థులకు సూచించారు.