దేశంలో ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఇప్పటికి మూడు దశల పోలింగ్ మాత్రమే ముగిసింది. ఇంకా చాలా ప్రాంతాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఫలితాలు విడుదల అవ్వడమే. అందుకు దాదాపు నెల రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎండలు కూడా మండుతుండటంతో...  నేతలు పర్యటనల బాట పట్టారు.

ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష  నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వారం రోజుల పాటు సేద తీరాక.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా.. ఏపీ సీఎం చంద్రబాబు కూడా శుక్రవారం పర్యటనకు బయలుదేరుతున్నారు.

ఆయన హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి లోకేష్ కూడా ప్రస్తుతం విదేశీ పర్యటనలోనే ఉన్నారు. వీరు మాత్రమే కాదు ఫలితాలు వెలువడడానికి సమయం ఉండటంతో.. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సేదతీరడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లారు.