అమరావతి: హోం మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి చిన్న రాజప్పకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. పెద్దాపురం సీటును ఆయనకు కేటాయించేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఆ సీటు నుంచి ప్రస్తుతం చినరాజప్ప శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పెద్దాపురం సీటును బొడ్డు భాస్కర రామారావుకు కేటాయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో బొడ్డు భాస్కర రామారావును వెంటనే అమరావతి రావల్సిందిగా చంద్రబాబు కబురు పెట్టారు. దాంతో చిన్న రాజప్ప తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది. 

ఈ స్థితిలో చిన్నరాజప్ప సీటుపై చర్చించేందుకు చంద్రబాబుతో భేటీకి ప్రయత్నం చేస్తున్నారు. మరో మంత్రి శిద్ధా రాఘరావును కూడా చంద్రబాబు లోకసభకు పోటీ చేయించేందుకు ప్రయత్నించారు. ఆయితే ఆయన ఇష్టపడకపోవడంతో వెనక్కి తగ్గారు.

ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాస రావు చినరాజప్ప ఎదుర్కుంటున్న పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. గంటాను లోకసభకు పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో గంటా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.